Ram Mohan Naidu As Aviation Minister | రామ్మోహన్ కి ఆ శాఖ ఇవ్వాలని మోదీ అనుకోవడానికి కారణం ఇదేనా

Ram Mohan Naidu As Aviation Minister | మోదీ 3.0 కేబీనేట్ లో టీడీపీకి విమానయాన శాఖ కేటాయించారు. ఈ శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు వ్యవహరించనున్నారు. ఐతే.. యువకుడు, విద్యావంతుడికి ఇదే శాఖ ఇవ్వడం వెనుక ఉన్న కారణాలేంటీ..? ఈ శాఖ తీసుకోవడంలో టీడీపీ వ్యుహమేంటో ఈ వీడియోలో తెలుసుకోండి..!

కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ద్రౌపది ముర్ము శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్డీయేకు కీలక మిత్రపక్షమైన టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. అతి పిన్న వయసు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు (36) నిలవనున్నారు. గతంలో ఆయన తండ్రి ఎర్రన్నాయుడు కేంద్రమంత్రిగా సేవలు అందించగా, నేడు తొలిసారి కేంద్ర మంత్రిగా యువనేత రామ్మోహన్ నాయుడు ప్రమాణం చేశారు.. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తండ్రి దివంగత ఎర్రన్నాయుడు 2012 నవంబర్ 2న రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. తండ్రి మృతితో రామ్మోహన్‌నాయుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola