MPDO Complaint : తూ.గో.జిల్లా అయినవిల్లి ఎంపీడీవో పై వైసీపీ నాయకుడి అనుచిత ప్రవర్తన | ABP Desam

చేయకపోతే చీరేస్తా అంటూ తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండల ఎంపీడీవో పై రెచ్చిపోయాడు ఓ వైసీపీ మాజీ సర్పంచ్. ఎంపీడీవో ఛాంబర్ లోనే ఎంపీడీవో కేఆర్ విజయపై ఏకవచనంతో రెచ్చిపోయాడు.... నేదునూరు పెదపాలెం మాజీ సర్పంచ్, వైసిపి నాయకుడు వాసంశెట్టి తాతాజీ.‌ ఎంపీడీవో నచ్చకపోతే పంపించేయండి అని అంటే సరిగ్గా చేయకపోతే చీరేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. మాజీ సర్పంచ్ తీరుతో మనస్తాపానికి గురైన ఎంపీడీవో....అమలాపురం డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో క్రమశిక్షణా చర్యలు తీసుకోవటమే వైసీపీ నాయకుడి ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. ఇటీవల జగనన్న ఆసరా పథకం చెక్కుల పంపిణీ లో ప్రోటోకాల్ పాటించలేదు అంటూ జడ్పిటిసి గన్నవరపు శ్రీనివాసరావు ఎంపీడీవో పై విరుచుకుపడగా కన్నీళ్ళ పర్యంతమయ్యారు ఎంపీడీవో కే.ఆర్. విజయ.అయినవిల్లి ఎంపీడీవో విజయ పై వైసిపి నాయకుడి దురుసు ప్రవర్తనను ఖండిస్తూ రేపు జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాలకు నల్ల బ్యాడ్జీలు ధరించి రావాలని ఎంపీడీవోల సంఘం నిర్ణయించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola