Bopparaju Venkateswarulu : పీఆర్సీ సహా ఉద్యోగ సంఘాలు పెట్టిన డిమాండ్లను తక్షణమే తీర్చాలి
పీఆర్సీ సహా రాష్ట్రప్రభుత్వం ముందున్న డిమాండ్లను తక్షణమే పరిష్కరించకపోతే....ఉద్యోగసంఘాలు ఉద్యమంలోకి దిగుతాయని ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. పదమూడులక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వాన్ని నమ్మి కరోనా సమయంలోనూ సహకరిస్తుంటే....ప్రభుత్వం తమ హక్కులను నెరవేర్చేందుకు సిద్ధంగా లేదని స్పష్టమవుతోందన్నారు. తిరుపతి సభలో సీఎం పీఆర్సీపై ప్రకటన చేశారని...కానీ ఉద్యోగులను చర్చలకు పిలిచి అవమానించరాని బొప్పరాజు మండిపడ్డారు.