Kaluvoya Fishermen : మత్స్యకారుల ఫైట్, కలెక్టరేట్ కి చేరిన పంచాయితీ| ABP Desam
Continues below advertisement
సోమశిల డ్యామ్ లో చేపలు పట్టే వ్యవహారం లో , సోమశిలలో ఉన్న మత్స్యకారులు తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ కలువాయికి చెందిన గిరిజనులు కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశారు. సోమవారం గ్రీవెన్స్ సెల్ కు వచ్చిన వారు అధికారులకు తమ గోడు చెప్పుకున్నారు. కలువాయికి చెందిన తాము తర తరాలుగా డ్యామ్ లో చేపలు పట్టుకుంటున్నామని, అయితే సోమశిల మత్స్యకారులు తమను అడ్డుకుంటున్నారని, తమపై దాడి చేస్తున్నారని, వలలు బలవంతంగా లాక్కెళుతున్నారని చెప్పారు. తమకు ప్రభుత్వం అనుమతిచ్చిన పత్రాలు చూపించినా వారు దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు. కలెక్టర్ తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
Continues below advertisement