JR NTR: ప్రాణాపాయ స్థితిలో ఉన్న అభిమానికి ఎన్టీఆర్ ధైర్యం
రోడ్డు ప్రమాదంలో గాయపడిన అభిమానిని పలకరించాడు జూనియర్ ఎన్టీఆర్. తూర్పుగోదావరి జిల్లా గూడపల్లికి చెందిన మురళీ ఇటీవల రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న ఆయన ఎన్టీఆర్ తో మాట్లాడాలనే కోరికను డాక్టర్ కి చెప్పాడు. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ తన అభిమానికి ఫోన్ చేసి ధైర్యం చెప్పాడు.