CI CPR For Amaravati Farmer : రాజమండ్రి పాదయాత్రలో రైతుకు సీపీఆర్ చేసిన పోలీస్ | DNN | ABP Desam

అమరావతి రైతుల పాదయాత్రలో ఓ పోలీస్ అధికారి చర్య ప్రశంసలు అందుకుంది. రాజమండ్రి బ్రిడ్జిపై పాదయాత్రగా వెళ్తున్న రైతుల్లో ఒకాయనకు గుండె పోటు రావటంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే పాదయాత్ర విధుల్లో ఉన్న సీఐ త్రినాథ్ తక్షణమే స్పందించారు. పడిపోయిన రైతుకు సీపీఆర్ చేసి స్పృహలోకి తీసుకువచ్చాడు. సీఐ తీసుకున్న నిర్ణయంతో రైతు ప్రాణాలు నిలిచాయి. ప్రాణాలు కాపాడిన సీఐ త్రినాథ్ ను అమరావతి రైతులు అభినందించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola