పోలవరం నిర్మాణ పనులు పరిశీలించిన కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కమిషనర్ ఎ.ఎస్.గోయల్ ,జాయింట్ కమిషనర్ అనుప్ కుమార్ శ్రీవాస్తవ.. బృందం పర్యటించారు. ప్రాజెక్టు స్పిల్ వే, స్పిల్ ఛానల్, కాపర్ డ్యామ్, గ్యాప్ త్రీ , గ్యాప్ వన్ , పవర్ హౌస్ పనులను కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ బృందం పరిశీలించింది ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులు ఆరాతీసారు. అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు