Punishment for 8 IAS Officers: Andhra Pradesh High Court సంచలన తీర్పు | ABP Desam
Andhra Pradesh High Court సంచలన తీర్పునిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది IAS అధికారులకు తొలుత 2 వారాల పాటు జైలు శిక్ష విధించింది. వారంతా క్షమాపణలు కోరటంతో జైలు శిక్ష తప్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లల్లో నెలలో ఓ రోజు వెళ్లి సేవ చేయాలని పేర్కొంది. ఇలా ఏడాది పాటు చేయాలని స్పష్టం చేసింది. దాంతో పాటుగా ఓ రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని వారిని ఆదేశించింది. పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని కోర్టు ధిక్కరణగా భావించి తొలుత జైలు శిక్ష విధించి, ఆ తర్వాత దాంట్లో మార్పులు చేసింది. ఆ 8 మంది IAS అధికారులు ఎవరంటే విజయ్ కుమార్, శ్యామలరావు, గోపాలకృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మి, గిరిజా శంకర్, వాడ్రేవు చిన వీరభద్రుడు, ఎంఎం నాయక్. వీరి వైఖరిని కోర్టు ధిక్కరణగా భావించి ధర్మాసనం తీర్పునిచ్చింది.