Protest Against AP Govt At AOB: ఒడిశా ప్రభుత్వమే ముద్దంటూ ఆందోళన
మా ప్రాణాలు కాపాడలేని ఆంధ్ర వద్దు, ఒడిశానే ముద్దు అంటూ పార్వతీపురం మన్యం జిల్లాలోని పలువురు ఆందోళనకు దిగారు. నాగావళి నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న రెబ్బ గ్రామస్థులు నిరసన చేపట్టారు. గిరిజనుల ప్రాణాలకు విలువ లేదని, కనీసం మరబోటును కూడా ఇవ్వలేని ఏపీ ప్రభుత్వం వద్దంటూ నినాదాలు చేశారు. విద్య, వైద్యం వంటివాటికి నిత్యం ప్రాణాలను పణంగా పెట్టి నది దాటాల్సి వస్తోందంటున్నారు