Innovative Wedding Procession In Konaseema: వెరైటీగా పెళ్లి ఊరేగింపు, మీరూ చూసేయండి..!
ఏదేమైనా సరే... కొన్ని విషయాల్లో గోదారోళ్ల తీరే స్పెషల్. ఇప్పుడు ఇదిగో ఇలా పెళ్లిలో కూడా సరికొత్త ట్రెండ్ కు దారి తీశారు. కోనసీమ జిల్లా రాజోలులో సుఖేష్, శ్రీరంగనాయకి అనే జంట...... తమ పెళ్లి ఊరేగింపును వెరైటీగా చేసుకున్నారు. వారిద్దరూ అందంగా అలంకరించిన ఓ వింటేజ్ రోల్స్ రాయిస్ కారులో ఎక్కి కూర్చున్నారు. దాని వెనుక పెద్ద కార్ల కాన్వాయ్. వారు కూర్చున్న కారు చుట్టూ బౌన్సర్లు. ఇక ముందు అన్నింటికన్నా హైలైట్. చీరలు కట్టుకున్న మహిళలు బుల్లెట్ నడుపుతూ ఊరేగింపునకు పైలట్ గా వ్యవహరించారు. ఈ వినూత్న పెళ్లి ఊరేగింపు విజువల్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి.