దాడికి పాల్పడిందెవరైనా సరే శిక్ష పడుతుందన్న హోం మంత్రి
ప్రత్తిపాడు నియోజకవర్గం బోయపాలెంలో వెంకటనారాయణ అనే వ్యక్తిపై జరిగిన దాడి ఘటనను టీడీపీ రాజకీయంగా వాడుకోవాలని చూడటం బాధాకరమని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు జరిగిన ఘటనపై కనీస అవగాహన కూడా లేకుండా స్పందించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అంతకుముందు, వెంకట నారాయణ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం వలన తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అందిన సమాచారం, ఐపీఎస్ ఆదేశాల తో సత్వరమే స్పందించామని రూరల్ ఎస్పీ శ్రీ విశాల్ గున్ని, నరసరావుపేట డిఎస్పీ శ్రీ విజయ భాస్కర్ చెప్పారు.ఘటనకు పాల్పడిన వారు ఎవరైనా సరే.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను హోంమంత్రి సుచరిత ఆదేశించారు.