IAS Pola Bhaskar: టోల్ వివాదం... ఐఏఎస్ అధికారితో టోల్ గేట్ సిబ్బంది వాగ్వాదం

Continues below advertisement

ప్రకాశం జిల్లా మాజీ కలెక్టర్, ఏపీ కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్ కి చేదు అనుభవనం ఎదురైంది. కర్నూలు-గుంటూరు రహదారిపై ఉన్న టోల్ గేట్ దగ్గర వివాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి టోల్ గేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా మాజీ కలెక్టర్‌, ప్రస్తుత ఏపీ కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్ వాహనాన్ని టోల్‌ గేట్‌ సిబ్బంది అడ్డుకున్నారు. పోలా భాస్కర్ వాహనానికి టోల్ కట్టే విషయంలో టోల్ గేట్ సిబ్బంది వాగ్వివాదానికి దిగారు. తాను ఐఏఎస్‌ అధికారినని, ఏపీ కాలేజ్ ఎడ్యూకేషన్ కమిషనర్‌గా ఉన్నానని పోలా భాస్కర్‌ టోల్‌ సిబ్బందికి ఆయన తెలిపారు.

తన  వాహనానికి టోల్‌గేట్‌ మినహాయింపు ఇవ్వాలని పోలా భాస్కర్ కోరారు. దీనిపై టోల్‌గేట్‌ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గుర్తింపు కార్డు చూపించాలంటూ పోలా భాస్కర్‌తో టోల్ గేట్ సిబ్బంది దురుసుగా వ్యవహరించారు. దీంతో పోలా భాస్కర్‌ వ్యక్తిగత సిబ్బంది టోల్‌గేట్‌ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టోల్ గేట్ సిబ్బంది పోలా భాస్కర్ వాహనానికి అడ్డంగా నిలబడి ఆయనను కదలకుండా అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న త్రిపురాంతకం తహసీల్దార్‌ కిరణ్‌, పోలీసులు టోల్‌గేట్‌ దగ్గరకు చేరుకున్నారు. తర్వాత ఐఏఎస్ అధికారి పోలా భాస్కర్‌ను అక్కడి నుంచి పంపించేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram