Ananthapuram: కానిస్టేబుల్ దురుసు ప్రవర్తనను నిలదీసిన యువకుడు
అనంతపురంలో ఓ కానిస్టేబుల్ దురుసు ప్రవర్తనకు యువకుడు ఆందోళన చేశాడు. బుక్కరాయసముద్రం ప్రాంతానికి చెందిన ఓ యువకుడు పని నిమిత్తం అనంతపురం నగరంలోని తాడిపత్రి బస్టాండ్ సమీపంలో ద్విచక్ర వాహనంలో వెళ్తున్నాడు. అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ యువకుడిని మరోదారి నుంచి వెళ్లాలని సూచించాడు. యువకుడు ద్విచక్ర వాహనాన్ని మరో దారి మళ్లించే సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ అతనిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా ఆ యువకుడు కానిస్టేబుల్ పై తిరగబడ్డాడు. తనను ఎందుకు కొట్టావో చెప్పాలని ప్రశ్నించాడు. తన పాటికి తాను చెప్పినట్టుగా వెళుతున్న దాడి చేయడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశాడు.