Police Beats Man Attempting Robbery: చోరీకి యత్నించిన వ్యక్తికి దేహశుద్ధి | Guntur | ABP Desam

కళ్లల్లో కారం కొట్టి డబ్బులు దోచుకుపోదామనుకున్న దొంగకి గుంటూరు జిల్లావాసులు దేహశుద్ధి చేశారు. బ్రాడిపేటకు చెందిన ఇమ్మాన్యూయల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. అయితే అనారోగ్యంతో ఉన్న తన తల్లిని హాస్పిటల్ లో జాయిన్ చేశాడు. చికిత్స కోసం బ్యాంక్ నుంచి 1.8 లక్షలు డ్రా చేశాడు. ఇదంతా చూసిన చంద్రశేఖర్.. immanuel డబ్బును ఎలాగైనా కొట్టేయాలనుకున్నాడు. దగ్గర్లోని షాప్ లో కారం కొనుక్కుని.. ఇమ్మాన్యుయల్ తో మాట కలిపాడు. ఆ తర్వాత అమాంతం తన కళ్లల్లో కారం కొట్టి డబ్బు తీసుకుని పారిపోయాడు. కాని ఇమ్మాన్యుయల్ అప్రమత్తమై అరవగా.. పోలీసులు అలెర్ట్ అయ్యారు. శంకర్ విలాస్ బ్రిడ్జిపై ఉన్న హోంగార్డు చంద్రశేఖర్ ను పట్టుకున్నాడు. స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకి అప్పగించారు. చంద్రశేఖర్ పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola