Police Arrest JC Prabhakar Reddy : ఇసుక రీచ్ పరిశీలించేందుకు వచ్చినప్పుడు అరెస్ట్
అనంతపురం జిల్లా పెద్ద పప్పూరు ఇసుక రీచ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రీచ్ పరిశీలించేందుకు వచ్చిన తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయనను ఏ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారన్న విషయం తెలియక అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సలకం చెరువు వద్ద జేసీ అనుచరుల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. పప్పూరు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే అన్ని రహదారులను పోలీసులు దిగ్బంధించారు.