Polavaram Flood Drone Shots : పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉద్ధృతి | ABP Desam
పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. స్పీల్ వే 48 గేట్ల ద్వారా 12,09,195 కూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. కడెమ్మ వంతెన ప్రాంతం పూర్తిగా నీట మునిగి పోయింది. పోలవరం పనులను ఆపేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్ట్ పోలీస్ చెక్ పోస్టును చుట్టుముట్టిన వరద నీరు..ప్రాజెక్టు ప్రధాన రహదారిపై 14 అడుగుల మేర నీటి మట్టం వచ్చేసింది. దీంతో ప్రాజెక్టులోకి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.