Polavaram Agency floods : కన్నాపురం పడమటి కాలువలో చిక్కుకున్న కారు | ABP Desam
ఏలూరు జిల్లా పోలవరం ఏజెన్సీలో ఎడతెరిపిలేని కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.ఏజెన్సీ వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పల్లపు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. కన్నాపురం పడమటి కాలువ వద్ద కారుతో సహా ముగ్గురు వ్యక్తులు తూర్పు కాలువ వద్ద కొండవాగు ఉధృతితో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తుల కోసం స్థానికులు గాలిస్తున్నారు కొండవాగుల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించి ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.