PM Modi With Rajinikanth Balakrishna | ప్రమాణస్వీకారసభలో బాలకృష్ణ, రజినీకాంత్ తో ప్రధాని మోదీ

Continues below advertisement

ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార సభలో నందమూరి బాలకృష్ణ, రజినీకాంత్ ను ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్‌ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. నాలుగోసారి ఏపీ సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబు రికార్డు సృష్టించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో, జేపీ నడ్డా, ఇతర రాజకీయ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అతిరథ మహారథులు కదలివచ్చిన వేళ ప్రమాణస్వీకారం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

1989లో కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కుప్పం నుంచి గెలుస్తూ వస్తున్నారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో 1995లో టీడీపీని హస్తగతం చేసుకున్నారు. అధికార మార్పిడిలో రాష్ట్ర సీఎంగా తొలిసారిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే కేంద్రంలో కూడా కీలకమైన వ్యక్తిగా మారరు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram