Chiranjeevi and Rajinikanth at Chandrababu Oath Taking | చంద్రబాబు ప్రమాణస్వీకారానికి అతిథులు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిథులుగా సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరు కానున్న విషయం ఇప్పటికే ఖరారైంది. ప్రధాని మోదీ బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనుండగా.. అమిత్ షా ఇప్పటికే ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నారు. వీరిద్దరూ రేపు ఉదయం జరగబోయే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు అవుతున్నారు. అమిత్ షా, మోదీతో పాటు జేపీ నడ్డా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

మరోవైపు, సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి దంపతులు కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న చిరంజీవికి ఘనస్వాగతం లభించింది. తమ్ముడి ప్రమాణస్వీకారానికి వచ్చిన అన్నకు జనసైనికులు ఘన స్వాగతం పలికారు. కాగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రభుత్వం నుంచి చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola