Chandrababu Emotional After Oath Taking | ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం తర్వాత చంద్రబాబు ఎమోషనల్

ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమోషనల్ అయ్యారు. మోదీ ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న చంద్రబాబు...సభకు వచ్చిన ప్రముఖులకు ధన్యవాదాలు చెప్పి తిరిగి వచ్చే క్రమంలో భావోద్వేగానికి గురయ్యారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవంలో అంతా పాల్గొన్నారు. కొందరు వీఐపీ గ్యాలరీలో కూర్చోగా.. మరికొందరికి వేదికపై చోటు కల్పించారు. రాజకీయ సినీ, వ్యాపార ఇతర రంగాల ప్రముఖులతో ఈ వేడుక కనులవిందుగా మారింది. గతంలో ఏ సీఎం ప్రమాణ స్వీకారానికి రాని హైప్ వచ్చిందనే ప్రచారం నడుస్తోంది.

ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. అనంతరం 11.15 నిమిషాలకు ప్రమాణ స్వీకారం జరిగే వేదికపైకి వచ్చిన ప్రధానమంత్రి కార్యక్రమం పూర్తయ్యే వరకు ఉన్నారు.. చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత ఆయనకు ప్రధానమంత్రి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా మోదీని కౌగిలించుకున్న చంద్రబాబు చాలా ఎమోషన్ అయ్యారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola