PM Modi With Chiranjeevi Pawan kalyan | చిరంజీవి, పవన్ తో కలిసి మోదీ అభివాదం

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రధాని మోదీ వారి అభిమానులకు అభివాదం చేశారు.

అనంతరం ఏపీ మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన తన అన్న మెగాస్టార్ చిరంజీవి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. పవన్ ప్రమాణం చేస్తున్నంత సేపు అభిమానులు, ప్రజలు కేరింతలు, నినాదాలు, కేకలతో సభ మొత్తం మార్మోగిపోయింది. ఈ క్రమంలో కొత్త ఉత్సాహం నెలకొంది. పవన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన సతీమణి అన్నా లెజీనోవా ఆనందంతో మురిసిపోయారు. అదే సమయంలో పవన్ బిడ్డలు అకీరా, ఆద్యాలు సంతోషంతో వీడియోలు తీశారు.

సీఎంగా చంద్రబాబు, మంత్రులుగా పవన్, నారా లోకేశ్, అచ్చెన్నాయుడుతో పాటు ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోదీ వేదికపై ఉన్న వారందరినీ పేరు పేరునా ఆత్మీయంగా పలుకరించారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్‌లతో కలిసి ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేశారు. దీంతో సభ మొత్తం మార్మోగిపోయింది. అనంతరం మోదీ సూపర్ స్టార్ రజనీ దంపతులకు నమస్కారం చేశారు. అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, బాలకృష్ణ, తమిళనాడు మాజీ సీఎం పనీర్ సెల్వం, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఇలా అందరినీ పేరు పేరునా పలుకరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola