Died: పోలీసులే చంపారంటున్న కుటుంబ సభ్యులు.. యువకుడి మృతిపై ఆరోపణలు.. గుంటూరులో ఏం జరిగింది?
Continues below advertisement
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో భట్రుపాలెంలో విషాదం జరిగింది. కారులో మద్యం తెస్తున్నారనే సమాచారంతో నిన్న ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు చేశారు. దాచేపల్లికి చెందినషేక్ అలిభాషా, మిరియాల శ్రీకాంత్ ను ప్రశ్నించారు. ఇద్దరినీ నడిరోడ్డుపై చితకబాదారని బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలో మనస్థాపంతో పురుగుల మందుతాగి షేక్ అలిభాషా మృతి చెందాడు. అయితే పోలీసులే పురుగులమందు తాగించారంటూ కుటుంబ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాంత్ ను పోలీసులు గతరాత్రి జైలుకు పంపారు. విషయం తెలిసి.. అతడి తాత గుండెపోటుతో మృతిచెందాడు. మరో ముగ్గురు యువకులపై హత్యయత్నం కేసు నమోదు చేసి పోలీసులు జైలుకు పంపారు.
Continues below advertisement