Pawan Kalyan on Tamilnadu Hindi Protest | తమిళనాడు హిందీ ఉద్యమాన్నే టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ |ABP

Continues below advertisement

పవన్ కళ్యాణ్  మాట్లాడేప్పుడు స్థిరంగా నించోరు.. మాట్లాడేప్పుడే కాదు.. మాట మీద కూడా సరిగ్గా ఉండరని ఓ విమర్శ ఉంది. అదేం కొత్తదీ కాదు… ఎవరికీ తెలియంది కాదు. అందుకే పార్టీ ప్లీనరీ వేదికపై నుంచి ఆయనే దానిపై ఓ క్లారిటీ కూడా ఇచ్చారు. అత్యంత తెలివిగా.. ఒడుపుగా ఆయనిచ్చిన సమాధానాన్ని ఎంత మంది అంగీకరిస్తారన్నది తర్వాత విషయం కానీ.. జయకేతనం వేదికపై నుంచి ఆయన చేసిన కొన్ని కామెంట్లపై మాత్రం చర్చ నడుస్తోంది. మాపై హిందీ పెత్తనం ఏంటని తమిళనాడు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న వేళ.. హిందీ ఉంటే తప్పేంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.   దేశాన్ని ముక్కులు చేస్తారా..? బహుబాషలు ఉంటే తప్పేంటి.. ? తమిళ సినిమాలు హిందీలో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు వంటి వ్యాఖ్యలున్నాయి. ఈ కామెంట్లకు తగిన వివరణలు ఆయన ప్రసంగంలో ఇచ్చారు.. కానీ ఇప్పుడు వినిపిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న… Bro... ఎందుకు వాళ్లని అనవసరంగా కెలకడం.. ?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram