Pawan kalyan on Chandrababu | చంద్రబాబును సీఎంగా ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్

Continues below advertisement

NDA ఎమ్మెల్యేల శాసనసభా పక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు నారా భువనేశ్వరి కన్నీళ్లు పెట్టుకున్నారని..అప్పుడు చంద్రబాబుకు మంచిరోజులు వస్తాయని చెప్పానని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్

 

 

గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ విపత్కర పరిస్థితులు ఎదుర్కొందని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.  ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు (Chandrababu) పేరును పవన్ ప్రతిపాదించారు. కష్టాల్లో ఉన్న ఏపీని గాడిన పెట్టేందుకు చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడు అవసరం అని చెప్పారు. అనంతరం చంద్రబాబును పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్ హాలులో మంగళవారం ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. చంద్రబాబును ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ తీర్మానాన్ని గవర్నర్‌కు పంపనున్నారు. ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పంపనున్నారు. అనంతరం బుధవారం ఉదయం 11:27 గంటలకు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram