Pawan Kalyan vs Tamilnadu Leaders | తమిళనాడు నుంచి వస్తున్న రియాక్షన్స్ పై పవన్ సంజాయిషీ | ABP Desam

Continues below advertisement

 హిందీ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ మీద తమిళనాడు నుంచి కౌంటర్ ఎటౌక్ మొదలైంది. హిందీ ని వద్దంటే వద్దంటున్న తమిళనాడు పొలిటికల్ లీడర్ల ఐడియాలజీని వేర్పాటు వాదంతో పోల్చిన పవన్...దేశ సమైక్యతకు అలాంటి ఆలోచనలు భంగం కలిగిస్తాయన్నారు. అయితే పవన్ మాట్లాడిన కొద్ది సేపటికే సినీ నటుడు, డీఎంకే సపోర్టర్ అయిన ప్రకాశ్ రాజ్ రియాక్ట్ అయ్యారు. హిందీ భాషను రుద్దకండి అని చెప్తున్నాం అంటే హిందీకి వ్యతిరేకం అని కాదు..మా భాషను మా తల్లిని కాపాడుకుంటున్నాం అని పవన్ కి ఎవరైనా చెప్పండి అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. మళ్లీ ఈ రోజు కూడా పవన్ గతంలో హిందీ ఇంపోజిషన్ పై మాట్లాడిన కామెంట్స్ ను చేస్తూ అప్పుడు ఆయన జనసేనాని ఇప్పుడు భజన సేనాని అంటూ మరో ట్వీట్ చేశారు. మరో వైపు అధికార పార్టీ డీఎంకే నుంచి పవన్ కు స్ట్రాంగ్ కౌంటర్స్ వస్తున్నాయి. సీఎం స్టాలిన్ కానీ, డిప్యూటీ సీఎం ఉదయనిధి కానీ ఇంకా పవన్ కామెంట్స్ పై స్పందించకపోయినా...డీఎంకే ఎంపీ, స్టాలిన్ సోదరి కనిమొళి ఓ ట్వీట్ చేశారు. టెక్నాలజీ అందుబాటులో ఉంది కాబట్టి మీ సినిమా చూడగలుగుతున్నాం అంటూ గతంలో హిందీ ఇంపోజిషన్ వద్దంటూ పవన్ చేసిన ట్వీట్స్ ను, ఇప్పుడు హిందీ నేర్చుకుంటే తప్పేంటీ అంటూ పవన్ మాట్లాడుతున్న మాటలను పోస్ట్ చేశారు కనిమొళి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram