Pawan Kalyan Announced Chandrababu as CM | NDA కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రకటన
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNDA కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్...చంద్రబాబు నాయుడును ఏపీ ముఖ్యమంత్రిగా ప్రకటించారు. NDA కూటమి శాసనసభా పక్షం తరపున ఈ ప్రకటన చేస్తున్నట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్..జనసేన పార్టీ తరపున తమ పూర్తి మద్దతును తెలుపుతున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు చేతిని పట్టుకుని మరీ ఈ విషయాన్ని చెబుతున్నానన్నారు పవన్ కళ్యాణ్
గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ విపత్కర పరిస్థితులు ఎదుర్కొందని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు (Chandrababu) పేరును పవన్ ప్రతిపాదించారు. కష్టాల్లో ఉన్న ఏపీని గాడిన పెట్టేందుకు చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడు అవసరం అని చెప్పారు. అనంతరం చంద్రబాబును పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్ హాలులో మంగళవారం ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. చంద్రబాబును ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ తీర్మానాన్ని గవర్నర్కు పంపనున్నారు. ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పంపనున్నారు. అనంతరం బుధవారం ఉదయం 11:27 గంటలకు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారు.