Paritala Sunitha: చంద్రబాబు నిరసనదీక్షలో పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరసన దీక్షలో పాల్గొన్న ఆమె... ఇప్పటికైనా చంద్రబాబు తీరు మారాలన్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక గంటసేపు కళ్లు మూసుకుంటే చాలు తామేంటో చూపిస్తామన్నారు. తన భర్త పరిటాల రవిని చంపినప్పుడు చంద్రబాబు ఓర్పుగా ఉండమన్నారు కాబట్టే ఉన్నామని, చంద్రబాబు ఆనాడే కన్నెర్ర చేసి ఉంటే ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదన్నారు. టీడీపీ తిరిగి అధికారం చేపట్టాక వైఎస్ఆర్సీపీకి చుక్కలు చూపిస్తామన్నారు.