Palnadu District Gajapuram Tiger Wandering: పులి సంచారంతో స్థానికుల్లో భయం భయం
పల్నాడు జిల్లాలో పులి సంచారంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 4,5 పులులు ఉన్నాయని స్థానికంగా జరుగుతున్న ప్రచారంతో మరింత ఆందోళన నెలకొంది. పల్నాడు జిల్లా గజపురంలో అటవీ ప్రాంతంలో నీటి కుంటల వద్దకు పులులు వస్తున్నాయని రైతులు అంటున్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల అటవీ ప్రాంతంలో నుండి పులులు బయటకు వస్తున్నాయని రైతులు ABP Desamతో అన్నారు.