వీఆర్వోలను క్షమాపణ కోరిన పలాస మున్సిపల్ కమిషనర్
శ్రీకాకుళం జిల్లా వీఆర్వోలపై దురుసుగా ప్రవర్తించిన మున్సిపల్ కమిషనర్ టి.రాజగోపాల్....పలాస కాశీబుగ్గ మున్సిపల్ సమావేశంలో క్షమాపణలు కోరారు. కమిషనర్ తీరును నిరసిస్తూ ఆందోళన చేసిన వీఆర్వోలు....తమ సమస్యను మంత్రి అప్పలరాజు దృష్టికి తీసుకెళ్లిగా ఆయన పరుషంగా మాట్లాడినట్లు వీఆర్వోలు ఆరోపిస్తున్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు క్షమాపణ చెప్పే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలను కొనసాగిస్తామని వీఆర్వోల సంఘం నేతలు తెలిపారు.