Kadapa: కమలాపురం నుంచి కడపకు ఉన్న ఈ ఏకైక మార్గం పాగేరు బ్రిడ్జి.
గత నెల నుంచి కురుస్తున్న వర్షాలకు వంకలు వాగులు చెరువులు నిండి పొంగిపొర్లాయి అనేకచోట్ల బ్రిడ్జి లు పడిపోయాయి. వైయస్సార్ జిల్లా కమలాపురం పాపాగ్ని నది బ్రిడ్జి కూలి పోవడంతో కమలాపురం నుంచి కడపకు ఉన్న ఈ ఏకైక మార్గంలో ఉన్న పాగేరు బ్రిడ్జిపై నుంచి ప్రజా రవాణా వాహనాలతో పాటు, భారీ రవాణా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో వరదలకు దెబ్బతిన్న బ్రిడ్జి మరింతగా దెబ్బతిని రాకపోకలు నిలిచిపోతే ప్రజలకు అసౌకర్యం అవుతుందని భావిస్తున్నారు. ప్రజా రవాణా వాహనాలు మాత్రమే అనుమతించి, భారీ రవాణా వాహనాలను నిలిపివేయాలని కోరుతున్నారు. పాగేరు బ్రిడ్జికి తక్షణం మరమ్మత్తులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.