Chalasani Srinivas: ప్రత్యేక హోదా పక్కన పెట్టలేదు...నన్ను ట్రోల్ చేయటం కరెక్ట్ కాదు
ప్రత్యేక హోదాను రెండున్నరేళ్లుగా పక్కన పెట్టేశానంటూ వస్తున్న కామెంట్లు సరికాదన్నారు చలసాని శ్రీనివాస్. ప్రత్యేక హోదా సాధన కమిటీ అధ్యక్షుడిగా తన పోరాటం కొనసాగుతూనే ఉందన్నారు. విభజన హామీల అమలు కోసం అన్ని పార్టీలు కలిసి రావాలన్న ఆయన....హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకూ మళ్లీ ఉద్యమం మొదలు పెడతామన్నారు. అమరావతి కి ఉద్యమానికి మద్దతిస్తున్నామనీ...అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అయితే అమరావతే రాజధానిగా ఉండాలన్నారు.