ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువులా ఓటీఎస్
ఏపీలో ఓటీఎస్ పథకం రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువైంది. ఓవైపు ప్రభుత్వం ఇది స్వచ్ఛందం అంటోంది, మరోవైపు అధికారులకు టార్గెట్లు పెడుతోంది. ఇంకోవైపు ప్రతిపక్షం అసలు ఓటీఎస్ రద్దు చేయాలంటోంది. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసిస్తామంటున్నారు చంద్రబాబు. అసలు ఓటీఎస్ చుట్టూ ఎందుకింత గందరగోళం ఉంది. ఇంతకీ ఓటీఎస్ స్వచ్ఛందమా? నిర్బంధమా..? అసలు సంగతేంటో ఓసారి చూద్దాం.