ఎయిడెడ్ కళాశాల అంశంపై విద్యార్థులతో అధికారులు జరిపిన చర్చలు సఫలం
ఎయిడెడ్ కళాశాలల అంశంపై నందిగామ కేవీఆర్ విద్యార్థులతో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్, ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు విద్యార్థుల డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. సుదీర్ఘ చర్చల తర్వాత ఎప్పటిలాగే కళాశాలను ఎయిడెడ్ కాలేజీ గా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు తెలిపారు. ఈ చర్చల్లో విద్యార్థులతో సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పాల్గొన్నారు.