బంధువుల ఇంటికి బైక్ లో వెళ్లారు.. నీటిలో చిక్కుకున్నారు..
Continues below advertisement
అనంతపురం జిల్లా,పెద్దపప్పూరు మండలం చాగల్లు రిజర్వాయర్ గేట్లు ఎత్తివేయడంతో, జోడి ధర్మాపురం కాజ్వే దగ్గర నీరు ఎక్కువ రావడంతో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు. అప్పుడు గ్రామస్థులు తాడు సహాయంతో వారిని రక్షించారు. ముగ్గురు రాయల చెరువు నుంచి జూటూరు కు వారి బంధువుల ఇంటికి వెళుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. మొత్తానికి గ్రామస్థుల సహాయం తో వారు ఊపిరి పీల్చుకున్నారు.
Continues below advertisement