Kuppam Meeting : కుప్పంలో చంద్రబాబుపై దాడికి యత్నం! అప్రమత్తమైన ఎన్ఎస్ జీ బలగాలు
కుప్పం సభలో చంద్రబాబుపై కొంతమంది వ్యక్తులు దాడికి యత్నించినట్లుగా ఎన్ఎస్‌జీ కమాండోలు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు చుట్టూ వలయంగా ఏర్పడి రక్షణ కల్పించేందుకు సన్నద్ధమయ్యయారు. అదే సభలో దాడికి యత్నించినట్లుగా భావిస్తున్న వ్యక్తులను గుర్తించిన తెలుగుదేశం కార్యకర్తలు వాళ్లను చితకబాదారు. దీంతో కొద్దిసేపు సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి సద్దుమణిగాక చంద్రబాబు ప్రసంగం కొనసాగించారు.త