North Andhra Agency: ఆస్పత్రికి వెళ్లాలంటే ఉత్తరాంధ్ర ఏజెన్సీల్లో ఇప్పటికీ డోలీలే దిక్కు
విద్యుత్ లేని ఊరంటూలేదు. వైద్యం అందని పల్లె లేదు.. చదువుకి దూరమైన పిల్లలు లేరు... ఇలా ప్రభుత్వాలు ఎన్నో మాటలు చెబుతున్నా... ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ గ్రామాల్లో పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తుంటాయి. గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని పాలకులు చెబుతున్నా.... ఇక్కడ జరుగుతున్న ఘటనలు, వారు పడుతున్న ఇబ్బందులను చూస్తే... అయ్యో... అనకుండా ఉండలేము. ఇప్పటికీ గర్భిణులను, రోగులను డోలీలు కట్టి.. రాళ్లు, ముళ్ల పొదలతో నిండిన కాలిబాట మార్గంలో కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లాల్సిందే.