రొటీన్ కు భిన్నంగా నెల్లూరులో ఈసారి స్వర్ణాల చెరువులో వినాయక నిమజ్జనం

నెల్లూరులో గతంలో లేని విధంగా ఈ ఏడాది వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. ఇన్నాళ్లూ పెన్నా నదిలో నీరు లేకపోయినా అందులోనే విగ్రహాలను వేసేవారు. కానీ ఈసారి పెన్నాలో కాకుండా స్వర్ణాల చెరువులో ప్రత్యేక గణేష్ ఘాట్ ఏర్పాటు చేసి నిమజ్జనోత్సవాలు జరిపారు. దీపారాధన చేశారు. పలు పుణ్యక్షేత్రాల నుంచి తెప్పించిన ప్రసాదాలను పంచారు. నిమజ్జనోత్సవం ఘనంగా జరిగిందని, ఈ ఘాట్ ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola