Somasila Water : గత అనుభవాలతో అధికారులు అప్రమత్తం..
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సోమశిలకు వరదనీరు పోటెత్తడంతో ఒకేసారి 12 గేట్లు ఎత్తి ఒకేరోజు 5లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు అధికారులు. దీంతో పెన్నా పరివాహక ప్రాంతాలు నీటమునిగాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు అనూహ్యంగా ఇన్ ఫ్లో పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒకేరోజు పెద్దఎత్తున నీటిని విడుదల చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మరోదఫా అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. ప్రస్తుతం సోమశిల ప్రాజెక్ట్ కి ఇన్ ఫ్లో పెరుగుతోంది. 95వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. అధికారులు ముందు జాగ్రత్తగా మొత్తం 12 గేట్లు ఎత్తేశారు.