Nellore Thief : నెల రోజుల పాటు తప్పించుకు తిరిగిన దొంగ దొరికాడు
Continues below advertisement
నెల్లూరు జిల్లా గూడూరు ఆదిశంకర కాలేజీలో విద్యార్థుల ఫీజు డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్ చేయకుండా కాజేసి పరారైపోయిన ఓ ఉద్యోగిని పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 70లక్షలు కాజేసి అతను తప్పించుకు పారిపోయాడు. సెప్టెంబర్ 23న ఈ ఘటన జరిగింది. దాదాపు నెలరోజులపాటు పోలీసుల కళ్లుగప్పి అతను తప్పించుకు తిరిగాడు. కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం తెలియదు. అయితే పోలీసులు అతడి ఫోన్ కాల్ ట్రాప్ చేసి పట్టుకున్నారు. 68లక్షల 50వేల రూపాయల్ని రికవరీ చేశారు
Continues below advertisement