చివరకు హోమ్ గార్డ్ కి అనుమానం రావడంతో దొరికిపోయారు.
నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ కిడ్నాప్ ఎపిసోడ్ ని పోలీసులు 24 గంటల లోపు ఛేదించారు. సినిమా స్టైల్ లో ఓ వడ్ల దళారిని కిడ్నాప్ చేసిన ఏడుగురు కిడ్నాపర్లు.. అతడిని కారులో ఎక్కించుకుని తన్నుకుంటూ తీసుకెళ్లారు. మార్గమధ్యంలో అతని వద్ద బంగారం ఉంగరం, నగదు దోచుకున్నారు. అక్కడితో ఆగలేదు. ఏటీఎం కార్డు లాక్కుని, పిన్ నెంబర్ తెలుసుకుని డబ్బులు డ్రా చేశారు. ఆ డబ్బుతో ఫూటుగా మద్యం తాగి కారులోనే బయలుదేరారు. కొడవలూరు మండలం అల్లిమడుగు సంఘం గ్రామానికి వెళ్తున్న క్రమంలో పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో హోమ్ గార్డ్ లు వారిని అడ్డుకుని అసలు విషయం ఆరా తీశారు. కారులో కిడ్నాప్ కి గురైన వ్యక్తి ఉండటంతో.. వారిని అదుపులోకి తీసుకున్నారు.