Nellore Rains: నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు..
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు మరోసారి జనం అవస్థలు పడుతున్నారు. గతంలో వరదల కారణంగా పెన్నా పరివాహక ప్రాంతాలు నీటమునగగా.. ఇప్పుడు కొత్తగా మరికొన్ని ప్రాంతాల ప్రజలు చెరువు కట్టలు తెగుతాయేమోనన్న భయంతో బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రాపూరు పెద్ద చెరువు కట్టలు తెంచుకునే స్థితికి వచ్చింది. భారీ వర్షాలకు చెరువులో నీరు అనూహ్యంగా పెరిగింది. మరోవైపు కలుజునుంచి నీరు బయటకు వెళ్తున్నా.. చెరువు కట్ట తెగే ప్రమాదం ఉందని చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.