ఒమిక్రాన్ నేపధ్యంలో నెల్లూరు కలెక్టర్ ముందే అప్రమత్తం..!
Continues below advertisement
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు కలవరపెడుతున్నాయి. ఏపీలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ బయటపడిందని కొన్ని పుకార్లు వచ్చాయి. అయితే దీనిపై నిర్లక్ష్యం లేకుండా ఇప్పుడు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. అన్ని జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తం అయ్యాయి. నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు.. కొవిడ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి సమీక్ష నిర్వహించారు. విదేశాలనుంచి వచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టామని తెలిపారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లోనే మెడికల్ టీమ్స్ విదేశాలనుంచి వచ్చేవారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తోందన్నారు.
Continues below advertisement
Tags :
Nellore