నెల్లూరు దర్గామిట్టలోని డీఐజీ కార్యాలయంలో సోదాలు
నెల్లూరు జిల్లా రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ డీఐజీ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు తనిఖీలకు వచ్చినట్టు సమాచారం. అయితే రెగ్యులర్ గా జరిగే తనిఖీలేనంటూ అధికారులు చెప్పడం విశేషం. నెల్లూరు నగరంలోని దర్గామిట్ట ప్రాంతంలో ఉన్న జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్నారు.