Nellore Aadhar center : అవగాహన లేని సంచార జాతి ప్రజల కోసం ఐటీడీఏ విన్నూత్న ప్రయత్నం | ABP Desam
అందరికీ ఆధార్ ఓ వరం. ఆధార్ కార్డ్ తో అన్ని పథకాలు అందిపుచ్చుకోవచ్చు. కానీ కొంతమంది గిరిజనులు, సంచార జాతులకు మాత్రం ఆధార్ ఇంకా అందనంత దూరంలోనే ఉంది. సంచార జాతుల్లో సగటున 50 శాతం మంది గిరిజనులకు ఆధార్ కార్డ్ అంటే ఏంటే తెలియని వాళ్లున్నారని నెల్లూరు జిల్లాలో అధికారులు గుర్తించారు.కేవలం గిరిజనులు, సంచార జాతుల కోసమే ఓ వినూత్న ప్రయత్నం చేశారు. నగరంలో ఓ ఆధార్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. ఎలాంటి పత్రాలు లేకపోయినా, వారివద్ద వివరాలు సరిగా ఉంటే.. అక్కడికక్కడే ఆధార్ నమోదు చేసుకుంటారు. గిరిజనులు, సంచార జాతుల వారికి ఆధార్ కష్టాలు లేకుండా చేసేందుకు ఐటీడీఏ పీవో కనకదుర్గా భవాని తెలిపారు.శాశ్వత ఆధార్ కేంద్రంతోపాటు.. సంచార ఆధార్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారామె. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం 5 మొబైల్ ఆధార్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. టీపీ గూడూరు మండలంలో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేశారు, మంచి ఫలితాలు సాధించారు. ఇప్పటి వరకూ 1400మందికి పైగా ఆధార్ లు అందించారు. వారిని ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా చేయడం సంతోషాన్నిచ్చిందని చెబుతారామె.