CPI RamaKrishna : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సీఎం జగన్ ఏకపక్ష నిర్ణయం | ABP Desam
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కనీసం మంత్రులతో కూడా మాట్లాడకుండా ఎలా జిల్లాలను పెంచుతారంటూ విమర్శించారు. రాష్ట్రంలో 13లక్షల ఉద్యోగులను రివర్స్ పీఆర్సీతో ఆర్థికంగా అణదొక్కారని రామకృష్ణ విమర్శించారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక బయటపెట్టకుండా ఉద్యోగుల పీఆర్సీ జీవోను విడుదల చేసారన్న రామకృష్ణ... ఇప్పుడు ఉద్యోగ సంఘాల జేఏసీ ఉద్యమాలు, దీక్షలు చేస్తున్నా....పీఆర్సీ పై మంత్రులతో కమిటీ వేసిసజ్జల సలహాదారు మాత్రమే సూచనలు చేయటేమేంటో అర్ధం కావడంలేదన్నారు. ఉప ముఖ్యమంత్రి,మంత్రులను డమ్మీలుగా తయారు చేసి ఒంటెద్దు పోకడలతో పాలన సాగుతోందని విమర్శించారు....రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని పాతరవేస్తున్నారని రామకృష్ణ అన్నారు.