Nellore:సెల్ ఫోన్ దుకాణంలో అగ్నిప్రమాదం.. ఎంత నష్టం జరిగిందో తెలుసా..?
నెల్లూరు నగరం ట్రంక్ రోడ్డు లస్సి సెంటర్ లో షార్ట్ సర్క్యూట్ తో అఖిల్ మొబైల్స్ దుకాణం దగ్ధమైంది. దాదాపుగా 15 లక్షల విలువ చేసే మొబైల్ ఫోన్స్ బూడిదయ్యాయి. అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. పక్కన ఉన్న దుకాణాలకు వ్యాపించకుండా అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. దుకాణ యజమాని శ్రీనివాసులు రెడ్డి ప్రమాదం జరిగిందని సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకొని ఆవేదన వ్యక్తం చేశారు.