Nadendla Manohar : ఇప్పుడు ఎక్కడున్నారు జగన్..? -నాదెండ్ల సెటైర్లు..

నెల్లూరు జిల్లాలో వరద బాధితుల పరామర్శకోసం వచ్చిన జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సీఎం జగన్ పై సెటైర్లు వేశారు. సందు సందులో తిరిగి జనాలకు ముద్దులు పెట్టిన జగన్ ఒక్క ఛాన్స్ అంటూ అడిగి సీఎం అయ్యారని, ఇప్పుడు ఆయన కనపడ్డం లేదని మండిపడ్డారు. వరదలతో కడప జిల్లా అతలాకుతలం అయితే.. ముఖ్యమంత్రి తన సొంత జిల్లాలో కూడా పర్యటించలేదని అన్నారు. కేవలం హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేశారని సీఎం వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ కి అలవాటు పడ్డారని చెప్పారు. కడప జిల్లాలో వచ్చిన వరదలకు ప్రకృతి విపత్తు కారణం కాదని, ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలేనని చెప్పారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola