Chandrababu Nellore Tour : చంద్రబాబు కారు ముందు తలబాదుకున్న కార్యకర్త

నెల్లూరులో వరద ప్రభావిత ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. చంద్రబాబు అధికారం కోల్పోయిన తర్వత కొంతమంది మహిళలు ఆయన వద్దకు వచ్చి భోరున విలపించిన వీడియో, ఫొటోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలపై వచ్చిన మీమ్స్ అన్నీ ఇన్నీ కావు. సరిగ్గా అలాంటి సంఘటనే నెల్లూరులో కూడా జరిగింది. నిన్నెలా తిట్టారయ్యా వైసీపీ నాయకులు అంటూ.. ఓ కార్యకర్త ఆయన కారు ముందు నిల్చొని చేతులతో తలబాదుకున్నాడు. సెక్యూరిటీ సిబ్బంది, ఇతర నాయకులు వారించినా ఆ కార్యకర్త కాసేపు తలబాదుకుంటూనే ఉన్నాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola