Polavaram|Anil Kumar Yadav: చంద్రబాబు వల్లే పోలవరం పూర్తి కాలేదు | ABP Desam
పోలవరం నిర్మాణం విషయంలో సోషల‌్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. మీ ఇష్టం వచ్చినట్లు ట్రోలింగ్ చేసుకోండని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ట్రోలింగ్ చేస్తున్నారని.. దీనిపై నెటిజన్లు ట్రోలింగ్ అంటూ.. కొన్ని మీడియా సంస్థలు వంతపాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంవల్లే పోలవరం నిర్మాణం పూర్తి కాలేదన్నారు. డిసెంబర్ 1 వతేదీ నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి అనిల్ అసెంబ్లీలో ఆవేశంగా చెప్పారు. ఆ వీడియోపై నిన్నంతా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ నడిచింది.