మంగళగిరిలో నారా లోకేష్ విస్తృత పర్యటన
అవినీతి తో అస్తవ్యస్తంగా జరుగుతున్న గౌతమ బుద్దా రోడ్డు నిర్మాణ పనుల పై లోకేష్ ఫైర్ అయ్యారు. రోడ్డు విస్తరణలో అధికార పార్టీ పక్షపాత ధోరణి కారణంగా రోడ్డు వంకర్లు తిరిగిందని ఆయన అన్నారు.తమకు పెన్షన్ కట్ చేసారని స్దానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ లోకేష్ కు ఫిర్యాదు చేశారు.నిడమర్రు రోడ్డు లోని రైల్వే గేట్ సమీపంలో ఉన్న డంప్ యార్డ్ ని పరిశీలించిన లోకేష్. వారంలో తొలగిస్తామని హామీ ఇచ్చి రెండున్నర ఏళ్లు అయినా డంప్ యార్డ్ తరలించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. డంప్ యార్డ్ కారణంగా నీరు కాలుషితం అయ్యి, స్థానికులు రోగాల బారిన పడుతున్నారని లోకేష్ అన్నారు.2వేల 800కోట్లు సీఎం జగన్ మంగళగిరికి కేటాయిస్తే స్దానిక ఎమ్మెల్యే వాటిని వినియోగించుకోలేకపోయారని అన్నారు. ...